Business Ideas: సొంతూరిలో ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించండిలా..
హైదరాబాద్: పల్లెటూళ్లలో వ్యవసాయం కాకుండా ఇతర ఆదాయ మార్గాల కోసం చూస్తున్న వారికి ‘మినరల్ వాటర్ ప్లాంట్’ ఒక అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం గ్రామాల్లో కూడా ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. కలుషిత నీటి వల్ల వచ్చే రోగాల భయంతో శుద్ధజలం (RO Water) తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల అవసరమే మీకు లాభదాయకమైన వ్యాపారంగా మారుతుంది.
బిజినెస్ ప్లాన్, పెట్టుబడి:
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 10 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. దీనిని ఈ క్రింది విధంగా విభజించవచ్చు.
- ప్లాంట్ నిర్మాణం: మెషినరీ, ప్యూరిఫికేషన్ సిస్టమ్ కోసం రూ. 5 లక్షలు.
- నీటి వనరు: సొంత బోర్ వెల్ ఏర్పాటుకు రూ. 1 లక్ష.
- రవాణా: గ్రామంలోని ఇంటింటికీ నీటి క్యాన్లను సరఫరా చేసేందుకు ఒక చిన్న వాహనం (Trolley) కోసం రూ. 4 లక్షలు.
నిర్వహణ, ఆదాయం:
నీరు అనేది నిత్యావసరం కాబట్టి ఈ బిజినెస్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కేవలం ఇళ్లకే కాకుండా, గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, ఫంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆర్డర్లపై నీటిని సరఫరా చేయవచ్చు. అన్ని ఖర్చులు పోను నెలకు సులభంగా రూ. 50,000 పైగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
అనుమతులు, నాణ్యత:
ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- లైసెన్స్: స్థానిక అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి.
- నీటి పరీక్ష: బోర్ నీటిని ల్యాబ్‌లో పరీక్షించి, అది తాగడానికి యోగ్యమైనదని సర్టిఫికేట్ పొందాలి.
- విశ్వాసం: నీటి నాణ్యత, రుచి, రంగులో మార్పు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలి. నాణ్యత బాగుంటేనే ప్రజలకు మీ ప్లాంట్ మీద నమ్మకం ఏర్పడుతుంది.
సొంత ఊరిలో ఉంటూ నలుగురికి ఉపాధినిస్తూ, పదిమందికి ఆరోగ్యకరమైన నీటిని అందించే ఈ వ్యాపారం నిజంగా గౌరవప్రదమైనది.






