Gold Breaking: బుల్లెట్ కంటే వేగంగా.. ‘బంగారం’ జర ఆగరాదు!
హైదరాబాద్ : బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగి సరికొత్త రికార్డును సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. తాజా మార్పుల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 6,923 పెరిగి, 3 శాతం GSTతో కలిపి ఏకంగా రూ. 1,75,015 వద్ద కొనసాగుతోంది.
అదేవిధంగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 6,346 ఎగబాకి రూ. 1,60,430కి చేరింది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధర కూడా భారీ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 4,00,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు నగరాల్లో స్థానిక పన్నులు, ఇతర ఖర్చుల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడించారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ భారీ ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారనుంది.






