Kalki2: కల్కి2 కు టైమ్ ఇచ్చిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prahas) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fauzi) అనే సినిమాను చేస్తూనే, మరోవైపు సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga)తో కలిసి స్పిరిట్(Spirit) మూవీ చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటూ ప్రభాస్ లైనప్ లో పలు భారీ ప్రాజెక్టులున్నాయి. వాటిలో కల్కి2(Kalki) కూడా ఒకటి. నాగ్ అశ్విన్(Nag ashwin) దర్శకత్వంలో వచ్చిన కల్కి ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పే పన్లేదు.
కల్కి(Kalki) సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే కల్కి రిలీజై చాలా కాలమవుతున్నా ఇప్పటికీ కల్కి2 మొదలవలేదు. దీంతో ఎప్పుడెప్పుడు కల్కి2 మొదలవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ఆడియన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కల్కి2 కు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, కల్కి2 షూటింగ్ కు ప్రభాస్ వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2 నుంచి డేట్స్ ను అడ్జస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ తో పాటూ కల్కి2 సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయనున్నాడన్నమాట. కమల్‌హాసన్(Kamal hassan), అమితాబ్ బచ్చన్(amitaab bachan) లాంటి దిగ్గజ నటులు నటిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్(Vyjanthi movies) భారీ బడ్జెట్ తో నిర్మించనుంది.






