Hey Bhagawan: సుహాస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘హే భగవాన్’ టీజర్ విడుదల
ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘హే భగవాన్’
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘లిటిల్‌హార్ట్స్’ ఫేమ్ శివానీ నగరం నాయిక. సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా బుధవారం ఈచిత్రం టీజర్‌ను విడుదల చేయడంతో పాటు ఫిబ్రవరి 20న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఈ సందర్భంగా జరిగిన ఈ చిత్ర వేడుకలో చిత్ర నిర్మాత బి.నరేంద్ర రెడ్డి. దర్శకుడు గోపీ అచ్చర, ప్రొడక్షన్ డిజైనర్ రామ్‌కుమార్, ఎడిటర్ విప్లవ్, డీవోపీ మహిరెడ్డి, వంశీ నందిపాటి, స్రవంతి చొక్కారపు, హీరో అఖిల్‌రాజ్, హీరోయిన్ తేజస్వీరావు, హీరో సుహాస్, హీరోయిన్ శివానీ నగరం, దర్శకుడు సాయి మార్తండ్, నటుడు సుదర్శన్, నిర్మాత రమణా రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ ”టీజర్ లాంచ్ అనగానే నాకు మేసేజ్‌లు వచ్చాయి. ఈ సినిమాలో నాది గత సినిమాలతో పోలీస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాత్రను చేశాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ కంటెంట్. ఇక నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి. ఈ సినిమాకు వంశీ నందిపాటి, బన్నీవాస్ యాడ్ అయిన తరువాత మా టీమ్‌కు మంచి బూస్ట్ వచ్చింది. నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ఫిలింగా నిలుస్తుంది. నాకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ” మా మొదటి ప్రయత్నం. నా కెరీర్లో ఇది ఇంపార్టెంట్ సినిమా. ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ” ఆరు నెలల ముందు ఈ కథ విన్నాను. ఒక సంవత్సరంలో సినిమా రెడీ అవుతుంది అనుకున్నాను. కానీ అనుకున్న కొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి బెటర్అవుట్పుట్తో వచ్చారు. ఈ సినిమాలో టీజర్ ఉన్నట్లుగా ఆడియన్స్ ఎవరైనా బిజినెస్ ఏదో గెస్ చేసి బహుమతి అందుకోవచ్చు. ఈ సినిమా నరేంద్ర కోసం టేకప్ చేసిన ఈ సినిమాలో ఎంతో పొటెన్షియల్ ఉంది. ఈ సినిమాతో నిర్మాత నరేంద్ర రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. సుహాస్ నుంచి ఆడియన్స్ ఎటువంటి కంటెంట్ కావాలని అనుకుంటున్నారో. ఇందులో అటువంటి కంటెంట్‌ను సుహాస్ డెలివరీ చేశాడు. సుహాస్ ఎంతో బాగా నటించాడు. ఈ సినిమాలో కొత్త సుహాస్‌ను చూడబోతున్నారు. శివానీకి ఈ సినిమా మూడో బ్లాక్‌బస్టర్. ఆమె పాత్ర కూడా సినిమాలో ఎంతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎడిటర్ విప్లవ్ కంటెంట్ ప్రొటెక్షన్ కోసం ఓ మంచి యాప్‌ను రెడీ చేశాడు. అది అందరికి ఎంతో ఉపయోగపడుతుంది. ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నాం. హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది’ అన్నారు.
శివానీ నగరం మాట్లాడుతూ ” వంశీ, బన్నీవాస్‌లు ఈ సినిమాను మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుపబోతున్నారు. వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే. దర్శకుడు గోపీ గారు ఈ సినిమా విషయంలో చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాలసినంత వినోదం ఉంది. సెట్ అంతా నవ్వుల మయంగానే ఉండేది. రేపు థియేటర్స్ కూడా నవ్వుల మయం కాబోతున్నాయి. సుహాస్‌తో మరో సినిమా చేయడం ఎంతో స్పెషల్‌గా ఉంది. ఫుల్ పవర్ ఫ్యాకడ్ ఎంటర్టైనర్ ఇది. ఫిబ్రవరి 20 ఈ సినిమా థియేటర్లో బ్లాస్ట్ కాబోతుంది’ అన్నారు.
చిత్ర దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ ” టీజర్ అందరికి నచ్చింది. ఫిబ్రవరి 20న మా నిర్మాతకు ఈ సినిమా రూపంలో బ్లాక్‌బస్టర్ ఇస్తున్నాను. సుహాస్ నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఎంతో ఫ్రెండ్లీ పర్సన్. ఎంతో డేడికేషన్ ఉన్న నటుడు. శివానీ చాలా ఫ్రొఫెషనల్ ఆర్టిస్ట్. నటుడు సుదర్శన్ ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో ప్లస్ అయ్యాడు. ఈ సినిమాతో యాంకర్ స్రవంతి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. వంశీ నందిపాటి గురించి, ఆయన పాషన్ కూడా అందరికి తెలుసు. సినిమా మీద ఎంతో ఎఫర్ట్ పెడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.
స్రవంతి చొక్కారపు మాట్లాడుతూ ” ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణమిది. యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నేను నటిగా కూడా గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. నేను వెండితెరపై నటిగా హే భగవాన్‌తో పరిచయం అవుతున్నాను. ఈ సినిమా వంశీ, బన్నీవాస్‌లు తీసుకున్నారు అనగానే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం వచ్చింది’ అన్నారు.
సుహాస్, శివానీ నగరం, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్, స్రవంతి చొక్కారపు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మహి రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. వివేక్ సాగర్ స్వరాలను అందించారు.






