Peddi: పెద్ది వచ్చేది దసరాకేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది(peddi). బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చిబాబు చాలా భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవడం లేదని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే పెద్ది మూవీ నుంచి రిలీజైన కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ షాట్(Peddi first shot) పేరుతో వచ్చిన గ్లింప్స్, చికిరి(Chikiri) అనే లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇదిలా ఉంటే పెద్ది సినిమాను మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఎప్పుడో చెప్పారు.
కానీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు చాలా టైమ్ పడుతుండటంతో ఇప్పుడు పెద్ది సినిమా రిలీజ్ వాయిదా పడుతుందని అంటున్నారు. ఒకవేళ మార్చిలో ఈ సినిమా రిలీజ్ మిస్ అయితే, 2026 దసరాకు పెద్ది రిలీజయ్యే అవకాశాలున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దసరా సీజన్ అయితే రామ్ చరణ్ సినిమాకు సరిగ్గా సరిపోతుందని వారు భావిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం పెద్ది రిలీజ్ డేట్ విషయంలో ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.






