Anna Garu Vostaru: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అన్నగారు వస్తారు
తమిళ హీరో అయినప్పటికీ హీరో కార్తీ(Karthi)కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉంది. అందుకే ఆయన నటించిన అన్ని సినిమాలూ తెలుగులో కూడా రిలీజవుతుంటాయి. కార్తీ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకునే ఏకంగా హిట్4(hit4) లో అతన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని శైలేష్(Sailesh) భావించాడు. ఇక అసలు విషయానికొస్తే కార్తీ హీరోగా నటించిన తాజా సినిమా వా వాతియార్(vaa vaathiyaar).
తెలుగులో ఈ సినిమాను అన్న గారు వస్తారు(Anna garu vastharu) అనే టైటిల్ తో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ లో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి, సంక్రాంతికి అనుకోకుండా తమిళంలో రిలీజైంది. తమిళంలో ఈ మూవీకి మిక్డ్స్ రెస్పాన్స్ రావడంతో ఇక సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో అని అంతా భావించారు.
అందరూ అనుకున్నట్టే అన్నగారు వస్తారు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. తమిళ, తెలుగుతో పాటూ పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.






