Nagarjuna: పాత్ర కావాలని నాగ్ ను కోరిన సీనియర్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత కెరీర్ హీరోయిన్లకు ఉండదు. ఎవరైనా సరే ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అందుకే ఎప్పుడో కెరీర్ ను మొదలుపెట్టిన హీరోలు ఇప్పటికీ సినిమాలు చేస్తుంటే, హీరోయిన్లు మాత్రం తమ సినీ కెరీర్ ను ముగించుకోవడమో లేక క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, లేదంటే సపోర్టింగ్ రోల్స్ చేస్తూనో కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే అలా ఎంతో మంది హీరోయిన్లు కనిపించారు.
సీనియర్ హీరోయిన్ టబు(Tabu) కూడా ఇందులో ఒకరు. ఆమె హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేశారు. టాలీవుడ్ లో నాగార్జున(nagarjuna) హీరోగా టబు హీరోయిన్ గా పలు సినిమాలు కూడా చేశారు. నాగ్ ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉంటే టబు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే నాగ్, టబు ఇద్దరికీ మంచి అనుబంధముంది.
ఆ అనుబంధంతోనే నాగ్ చేయనున్న 100వ సినిమాలో తాను నటించాలనుకుంటున్నట్టు నాగ్ ను కోరిందట టబు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాను తమిళ డైరెక్టర్ రా.కార్తీక్(Ra. Karthik) దర్శకత్వంలో చేస్తుండగా అందులో ఓ పాత్ర కావాలని టబు నాగ్ ను అడిగిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంతన్నది పక్కన పెడితే, నిజంగానే టబు, నాగ్ సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తే బావుంటుందని అక్కినేని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. త్వరలోనే నాగ్100(Nag100) షూటింగ్ మొదలు కానుంది.






