Shabara: ‘శబార’ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది.. హీరో దీక్షిత్ శెట్టి
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ ఈ సినిమాకి కెమెరామెన్‌గా పని చేశారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ నిర్వహించిన కార్యక్రమంలో..
దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. ‘‘శబార’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి మీడియా మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ‘శబార’కి కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ క్రియేట్ చేసిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది. ఈ మూవీకి ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుంది. నేను ఇంత వరకు 8 సినిమాలు చేశాను. మొదటి సారిగా ఓ మనిషి మీద నమ్మకం పెట్టుకుని ప్రేమ్ చంద్ కోసం ఈ మూవీని చేశాను. రెండేళ్లుగా మాతో ప్రయాణం చేసిన టీంకు థాంక్స్. మిథున్ తన మ్యూజిక్‌తో మాయ చేశారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చితే షేర్ చేసి, అందరికీ చేరేలా సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు మాట్లాడుతూ.. ‘హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా నాన్న నాకు దేవుడి కంటే ఎక్కువ. ఆ నాన్ననే ఎదురించి సినిమాను తీస్తున్నానంటే.. ఎలాంటి సినిమాని తీస్తుంటానో అర్థం చేసుకోండి. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన దీక్షిత్ గారికి థాంక్స్. మిథున్ గొప్ప సంగీతాన్ని అందించారు. ఇకపై నా ప్రయాణం ఆయనతోనే కంటిన్యూ చేస్తాను. అజయ్ అబ్రహం జార్జ్ పేరు ఇకపై ఎక్కువగా వినిపిస్తుంది. సినిమానే అంతా మాట్లాడుతుంది. నచ్చింది చేయడమే జీవితం’ అని అన్నారు.
క్రితిక సింగ్ మాట్లాడుతూ.. ‘ప్రేమ్ చంద్ గారు లేకపోతే ‘శబార’ ఇంత గొప్పగా వచ్చేది కాదు. నన్ను నమ్మి ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తామ’ని అన్నారు.
మీషా నారంగ్ మాట్లాడుతూ .. ‘‘శబార’ కన్నులపండుగగా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన లొకేషన్లలో సినిమాని షూట్ చేశాం. ఎంతో కష్టపడి మూవీని తీశాం. అందుకే హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’ అంత గొప్పగా అనిపించింది. ప్రేమ్ చంద్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ‘శబార’ని మీడియా, ఆడియెన్స్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామ’ని అన్నారు.
రాజీవ్ పిళ్లై మాట్లాడుతూ.. ‘‘శబార’లో నన్ను తీసుకున్నందుకు ప్రేమ్ గారికి థాంక్స్. ప్రేమ్ గారు ఇంత వరకు ఒక్క సినిమాకి కూడా పని చేయలేదు. కానీ ఈ మూవీని మాత్రం ఎంతో గొప్పగా, అనుభవం ఉన్న దర్శకుడిలా తీసుకున్నారు. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం మేం వెయిట్ చేస్తున్నాం. ఇది థియేటర్లో చూడాల్సిన చిత్రం. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది’ అని అన్నారు.
భూషణ్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘శబార’ కథ విన్నప్పుడు చాలా ఆశ్చర్యమేసింది. ఇలాంటి కథలు నటీనటులకు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కథలో భాగమైనందుకు నాకెంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.
క్యాస్టూమ్ డిజైనర్ సుమాయా మాట్లాడుతూ .. ‘‘శబార’ది రెండేళ్ల ప్రయాణం. ఇప్పటికి ఇలా ఆడియెన్స్ ముందుకు వచ్చాం. సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం’ అని అన్నారు.
ప్రొడక్షన్ డిజైనర్ శివ కామేష్ మాట్లాడుతూ .. ‘ప్రేమ్ గారు గొప్ప దర్శకుడు. ‘శబార’ అద్భుతంగా వచ్చింది. ఇందులో కెమెరా వర్క్ గొప్పగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
మోహన్ భగత్ మాట్లాడుతూ .. ‘భూషణ్ గారికి కథ నచ్చిందని నేను కూడా ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను. ఇందులో ఐదు ఇంపార్టెంట్ కారెక్టర్స్ ఉంటాయి. సినిమాని ప్రేమ్ చంద్ గారు గొప్పగా తీశారు. నిధి చుట్టూ తిరిగే ఈ కథ చాలా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ముకుందన్ మాట్లాడుతూ .. ‘హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు అవకాశం ఇచ్చిన ప్రేమ్ చంద్ గారికి థాంక్స్. ఆయన కథ చెప్పిన తీరు చూసిన తరువాత ఈ సినిమా వంద శాతం హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఏర్పడింది. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తామని అన్నారు.






