Cheekatilo: ప్రైమ్ లో నెం.1లో ప్లేస్ లో చీకటిలో..
అక్కినేని కోడలు శోభితా ధూళిపాల(Shobhita Dhulipala) నటించిన ఓ కొత్త సినిమా ఒకటి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. చీకటిలో(cheekatilo) అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చీకటిలో సినిమా అందుబాటులోకి రాగా, ఈ సినిమా వీక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటుంది.
తెలుగు క్రైమ్ డ్రామా గా వచ్చిన చీకటిలో సినిమా అమెజాన్ ప్రైమ్ లో నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి ఆడియన్స్ ను మెప్పించింది అంటూ సోషల్ మీడియాలో తమ తమ ఎక్స్పీరియెన్స్లను షేర్ చేసుకుంటూ డిస్కషన్స్ మొదలుపెట్టారు. టాక్ ప్రకారం శోభితా యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీకి అందరూ ఆమెపై మంచి ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాకపోతే సినిమా మొత్తం ఆమె యాక్టింగ్ పైనే ఆధారపడేలా తీశారని అంటున్నారు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పైగా దానికి మంచి మౌత్ టాక్ రావడంతో ఈ మూవీకి మంచి వ్యూస్ వస్తున్నాయి. అయితే కథ పరంగా మాత్రం కాస్త స్లో గా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా కంటెంట్ ఆధారిత సినిమాలను ఇష్టపడే ఓటీటీ ఆడియన్స్ కు చీకటిలో నచ్చుతుందని చెప్పొచ్చు.






