Salaar2: సలార్2 ఫ్యాన్స్ కు ఎగ్జైటింగ్ అప్డేట్
బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్, తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ కు తగ్గట్టే ప్రభాస్ సినిమాలు కూడా చేసుకుంటూ వచ్చాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాల్లో సలార్ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఇంకా చెప్పాలంటే సలార్ సినిమాకు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా ఎన్ని సంచలనాలు, రికార్డులు సృష్టించిందో తెలిసిందే. సలార్ కు సీక్వెల్ గా సలార్2 రానున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే సలార్2 సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ మధ్య సలార్2 నుంచి జనవరి నెలాఖరుకి ఓ అప్డేట్ వస్తుందని, అది కూడా సలార్2 సినిమా ఇక ఉండదు, ఈ సీక్వెల్ ఆగిపోయిందనే అప్డేట్ వస్తుందని కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ సలార్2 మేకర్స్ శృతి హాసన్ బర్త్ డే విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సలార్2 సెట్స్ లో మిమ్మల్ని చూడ్డానికి వెయిట్ చేస్తున్నామని శృతికి విషెస్ చెప్పడంతో సలార్2 క్యాన్సిల్ వార్తలకు చెక్ పడినట్టైంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.






