RC17: చరణ్-సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్డేట్
ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్(ram charan) ఆ తర్వాత చేసిన ఆచార్య(Acharya), గేమ్ ఛేంజర్(Game changer) సినిమాలతో దారుణమైన ఫలితాల్ని అందుకున్నాడు. దీంతో తన తర్వాతి సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చరణ్ ఎంతో కసిగా ఉన్నాడు. అందులో భాగంగానే పెద్ది(Peddi) అనే సినిమాను చేస్తున్నాడు చరణ్.
బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకుంది. జాన్వీ కపూర్(janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ చరణ్ కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఉన్నారు. ఇదిలా ఉంటే పెద్ది తర్వాత చరణ్, సుకుమార్(sukumar) దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
సుకుమార్ ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉండగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వినిపిస్తోంది. చరణ్ తో సుకుమార్ చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తైందని, పెద్ది సినిమా షూటింగ్ పూర్తవగానే, చరణ్ ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాగా గతంలో సుకుమార్, చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.






