The Paradise: ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్(The Paradise). హిట్3(hit3) సక్సెస్ తర్వాత నాని చేస్తున్న సినిమా ఇది. దసరా(Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే నాని, శ్రీకాంత్ కలయికలో దసరా సినిమా వచ్చి ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో ది ప్యారడైజ్ పై అందరికీ ముందు నుంచే మంచి అంచనాలున్నాయి.
ఆ అంచనాలను ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రా స్టేట్మెంట్ వీడియో ఇంకాస్త పెంచింది. ఈ మూవీలో నాని గెటప్, లుక్స్ పూర్తి భిన్నంగా ఉండటంతో శ్రీకాంత్ ఈ సారి ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశాడని అందరికీ అనిపిస్తుంది. మార్చి 26న ది ప్యారడైజ్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే చెప్పారు కానీ ఇప్పుడది వాయిదా పడటం గ్యారెంటీ అని తెలుస్తోంది.
దానికి కారణం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవకపోవడమే. ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ బుధవారం నాడు ప్రారంభమవగా, దీంతో ది ప్యారడైజ్ ఫస్టాఫ్ షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. సెకండాఫ్ షూటింగ్ ను బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.






