Sri Chidambaram Garu: శ్రీ చిదంబరం గారు ట్రైలర్‌ను విడుదల చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా
ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన ‘వెళ్లేదారిలో’ అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు, ప్రస్తుతం మెగా పవర్‌స్టార్‌తో పెద్ది అనే పాన్ ఇండియా చిత్రాన్ని డెరెక్ట్ చేస్తున్న బచ్చిబాబు సానా విడుదల చేశారు.
ఈసందర్భంగా ఆయన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు. ఫిబ్రవరి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ను గమనిస్తే.. శ్రీచిదంబరంగారు ఓ ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీలా అనిపిస్తుంది. ఈ కథలో కమర్ఫియల్ మేసేజ్‌తో పాటు ఓ బ్యూటిఫుల్ మేసేజ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో నేచురాల్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచేవిధంగా ఉంది.
నిర్మాత మాట్లాడుతూ ” అంతా కొత్తవాళ్లతో తీసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పయిర్ అయ్యే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది. తప్పకుండా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మెకం ఉంది’ అన్నారు.






