Multistarrer: టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందా?
ఈ మధ్య మల్టీస్టారర్ల ట్రెండ్ విపరీతంగా పెరిగింది. ఇద్దరు హీరోలతో సినిమా చేసి, ఆ సినిమాకు మొదటి నుంచే మంచి హైప్ తెచ్చుకోవడం ఫ్యాషనైపోయింది. అందులో భాగంగానే ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో దాదాపు అన్ని సినిమాలకూ మంచి ఓపెనింగ్స్, కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఆ మల్టీస్టారర్ లో నటించబోయే హీరోలు మరెవరో కాదు, అక్కినేని యంగ్ హీరోలు. అక్కినేని నాగ చైతన్య(akkineni naga chaitanya), అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరోలుగా ఓ మల్టీస్టారర్ ను చేయడానికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఓ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతన్నది పక్కన పెడితే ఇది విని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక వీరిద్దరి కెరీర్ల విషయానికొస్తే తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న చైతన్య, తన తర్వాతి సినిమాను విరూపాక్ష(Virupaksha) డైరెక్టర్ కార్తీక్ దండు(karthik Dandu) దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్(Agent) డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్, ఆఖరికి మురళీ కిషోర్ అబ్బూరు(Murali kishore abburu) చెప్పిన కథకు ఓకే చెప్పి లెనిన్(lenin) అనే సినిమాను చేస్తున్నాడు. లెనిన్ పై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.






