HHVM2: వీరమల్లు2పై కొత్త అప్డేట్
2019లో పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా క్రిష్(Krish) దర్శకత్వంలో మొదలైన హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) ఆ తర్వాత పలు కారణాల వల్ల క్రిష్ తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని ఏఎం జ్యోతికృష్ణ(AM Jyothi krishna) తీసుకుని సినిమాను పూర్తి చేసి ఆరేళ్ల తర్వాత 2025లో రిలీజ్ చేశారు. మంచి అంచనాలతో రిలీజైన వీరమల్లు ఫస్ట్ షో నుంచే ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
వీరమల్లు కథ పెద్దగా ఉందని సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ముందే చెప్పిన సంగతి తెలిసిందే. వీరమల్లు ఫస్ట్ పార్ట్ కు మిశ్రమ స్పందన రావడంతో వీరమల్లు2(HHVM2) ఉంటుందా లేదా అనే విషయంలో అందరికీ సందేహాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ కు మంచి రెస్పాన్స్ రాకపోతే ఆ సీక్వెల్స్ ను నిలిపివేయడం చాలా సినిమాల విషయంలో చూశాం.
దీంతో వీరమల్లు2 ఉంటుందా లేదా అని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వినిపిస్తోంది. వీరమల్లు2 కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని, పవన్ కళ్యాణ్ టైమ్ ఇస్తే కథను నెరేట్ చేయాలని జ్యోతికృష్ణ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి మొదటి పార్ట్ కు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ సీక్వెల్ కు ఓకే అంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.






