Assembly: తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జపాన్ బృందం
తెలంగాణ శాసనసభను జపాన్లోని అయిచి రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల బృందం తో కూడిన అయిచి ఎకనమిక్ డెవలప్మెంట్ ఫోరం సందర్శించింది. ఫోరం చైర్మన్ హిరిహితో కోండో సహా 9 మంది అయిచి బృంధానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukhender Reddy), మండలి కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి స్వాగతం పలికారు. సభాపతి ఛాంబర్లో సమావేశమై తెలంగాణ- అయిచి రాష్ట్ర సభ్యుల మధ్య వివిధ రంగాలలో సహకారంపై చర్చించారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడానికి సీఎం రేవంత్ (CM Revanth) కషి చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి అని తెలిపారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత్- జపాన్ ల మధ్య చారిత్రక స్నేహ సంబంధాలున్నాయని పేర్కొన్నారు.






