NATS: నార్త్ అమెరికా తెలుగు సంఘం (NATS) 2026-27 కార్యవర్గ ప్రకటన.. పూర్తి జాబితా ఇదే!
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) 2026-2027 కాలానికి సంబంధించి తమ నూతన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BOD), అడ్వైజరీ బోర్డ్ సభ్యుల వివరాలను అధికారికంగా ప్రకటించింది. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఈ సంస్థ, అనుభవజ్ఞులైన సీనియర్లతో పాటు ఉత్సాహవంతులైన యువ నాయకత్వానికి ఈ కమిటీలో చోటు కల్పించింది.
జనవరి 2026లో బాధ్యతలు చేపట్టిన ఈ నూతన కార్యవర్గంలోని ప్రధాన సభ్యుల వివరాలు:
- ఛైర్మన్: కిషోర్ కంచర్ల
- వైస్ ఛైర్మన్: మధు బొడపాటి
- బి.ఓ.డి సెక్రటరీ: ఆది గెల్లి
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (BOD) సభ్యులు: రాజేంద్ర మాదాల, ప్రేమ్ స్వరూప్ కలిదిండి, రఘు రొయ్యూరు, బిందు యలమంచిలి, టి.పి. రావు, రమేష్ బెల్లం, శ్రీనివాస్ మెంటా, శ్యామ్ నాలం, శ్రీనివాస్ మల్లాది, కృష్ణ బర్రీ, అను కొత్త, రాజేష్ నెట్టం, శ్రీనివాస్ బొప్పన, శ్రీరామ్ కొప్పాక, శేషు రెడ్డి, కృష్ణ మల్లిన, సాయి ప్రసాద్ పలుస, విజయ్ కొండ, అజయ్ గోవాడ, రాజేష్ చిలుకూరి, వెంకట్ వీర, శివ కనుమూరి.

సంస్థకు మార్గదర్శకత్వం వహించేందుకు అనుభవజ్ఞులైన మాజీ అధ్యక్షులు, నిపుణులతో అడ్వైజరీ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులు వీరే..
- డా. సుధీర్ సి అట్లూరి (నాట్స్ మెడికల్ డైరెక్టర్)
- గంగాధర్ దేసు (మాజీ అధ్యక్షుడు)
- మోహన్ కృష్ణ మన్నవ (మాజీ అధ్యక్షుడు)
- విజయ్ శేఖర్ అన్నే (మాజీ అధ్యక్షుడు)
- మదన్ పాములపాటి (మాజీ అధ్యక్షుడు)
- శ్రీనివాస్ మంచికలపూడి (మాజీ అధ్యక్షుడు)
- సుమిత్ అరిగపూడి (మాజీ బి.ఓ.డి)
ఈ నూతన బృందం రాబోయే రెండేళ్ల కాలంలో ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లో మరింత అండగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేస్తూ వినూత్న కార్యక్రమాలను రూపొందించే దిశగా అడుగులు వేస్తోంది. కిషోర్ కంచర్ల నాయకత్వంలో నాట్స్ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ప్రవాస తెలుగు వారు ఆకాంక్షిస్తున్నారు.






