Kavitha:ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదు : కవిత
ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసింది మాజీ ఎంపీ సంతోష్‌రావేనని (Santosh Rao) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Constable Soumya)ను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గద్దర్ (Gaddar) లాంటి నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం ఆయనేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసులంటే గంజాయి సరఫరాదారులు, స్మగ్లర్లకు భయంలేదని అన్నారు. ఎక్సైజ్ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంటేనే భయం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో గహ హింస పెరిగిపోతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి. నేను ముందునుంచి చెబుతున్న దెయ్యం ఆయనే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ సంతోష్‌కు ఎలాంటి శిక్ష విధిస్తుందనేది వేచి చూడాలి. ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదు అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






