USA: టారిఫ్ లతో ట్రంప్ ఖజానా కళకళ.. మిత్రులు మాత్రం దూరం దూరం..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లతో ప్రపంచదేశాలను అదరగొడుతున్నారు. నాకు నచ్చలేదంటే.. అంతే నీమీద టారిఫ్ బండపడేస్తా.. ఏమనుకున్నావో అంటూ నిర్థాక్షిణ్యంగా బెదిరిస్తున్నారు. అంతేనా.. సహజ మిత్ర దేశాలుగా భావించే యూరప్ దేశాలకు.. ట్రంప్ షాకులిచ్చారు. అమెరికాతో ఒప్పందం లేకుంటే మీపని మీదే అన్నారు. రక్షణ ఒప్పందం విషయంలోనూ ట్రంప్.. తన మాటే ఫైనల్ అంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయ విధానాలపై యూరప్ దేశాలు దృష్టి సారించాయి.
దీంతో అతిపెద్ద మార్కెట్ దేశాలైనా చైనా, భారత్ లాంటి విశాల మార్కెట్లపై యూరప్ దేశాలు ఫోకస్ పెట్టాయి. ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి.అంటే.. ఇక అన్నింటికీ అమెరికాపై ఆధారపడే పరిస్థితి ఉండదన్నమాట. ఇటు భారత్ కు, అటు యూరోపియన్ యూనియన్ దేశాలకు లాభకరమైన ఒప్పందంగా దీన్ని చెప్పవచ్చు.
ఈ ఎఫ్టీఏలో 97 నుంచి 99 శాతం రంగాలు చేరాయి. 90 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించేందుకు లేదా పూర్తిగా రద్దు చేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. సేవారంగంలోనూ ఉదారత పెరగనుంది. టెలికమ్యూనికేషన్స్, రవాణా, అకౌంటింగ్, ఆడిటింగ్ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. టెక్స్టైల్స్, కెమికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్, ఫుట్వేర్ వంటి కార్మికాధారిత రంగాలకు భారత ఎగుమతిదారులకు డ్యూటీ ఫ్రీ లేదా ప్రాధాన్య ప్రాప్యత లభించనుంది.
ఇప్పటివరకూ అమెరికా చెప్పిన మాటలకు.. ఈయూ బాసటగా నిలిచేది. ఇక నుంచి ఆపరిస్థితి ఉండదు.
వాణిజ్యపరంగా అమెరికా లాభపడవచ్చు ..కానీ… ఇప్పుడు కేవలం బలంతోనే అమెరికా అన్నీ సాధించే పరిస్థితి ఉండదు. దశాబ్దాలుగా తనతో పాటు నడిచిన యూరప్ ఇప్పుడు.. తన దారి తాను చూసుకుంటోంది. మిగిలిన దేశాలు కూడా అదే దారిని అనుసరించే అవకాశం కనిపిస్తోంది.






