Devagudi: ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో “దేవగుడి”- బెల్లం రామకృష్ణ రెడ్డి
“దేవగుడి” సినిమా నటుడిగా నాకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను – యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె.
దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
– నేను ఉద్యోగం చేస్తున్న టైమ్ లో భగవద్గీత ఆధారంగా యధాతథం అనే కాన్సెప్ట్ తో సినిమా చేయాలని అనుకున్నాను. భగవద్గీత మతగ్రంథం అనుకుంటారు గానీ అది సైంటిఫిక్ గా నిజమని ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ కాన్సెప్ట్ తో మూవీ నిర్మించాలని శ్రీకాంత్ గారిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేశాం. ఆ టైమ్ లో శ్రీకాంత్ గారు సినిమాలో నా ఇన్వాల్వ్ మెంట్ చూసి మీలో దర్శకుడు కూడా ఉన్నారు. మీరే డెరెక్ట్ చేయొచ్చు కదా అని ఎంకరేజ్ చేశారు. ఆ మూవీ తర్వాత దృశ్యకావ్యం సినిమాను నా దర్శకత్వంలో తెరకెక్కించాను. ఇప్పుడు “దేవగుడి” సినిమా రూపొందించాను. ఇది దర్శకుడిగా నా రెండో మూవీ
– సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్లను ఎలా యూజ్ చేసుకుంటారో మీకు తెలుసు. గత చిత్రాల విషయంలో నాకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ సినిమాను జాగ్రత్తగా రూపొందించాను. నేను ఇంజినీర్ ను కాబట్టి పక్కా ప్లానింగ్ తో అనుకున్న టైమ్ లోనే షూటింగ్ కంప్లీట్ చేశఆం. జస్ట్ ఓ 10 పర్సెంట్ బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది.
– ఇటీవల రిలీజ్ చేసిన మా మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్ర గారు పాడిన ఆరో ఆరారో పాటకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ లో మా చిత్రానికే డిజిటల్ వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఉంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి బిజినెస్ పరంగా మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి.
– ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే మా మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా, అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. దేవగుడి వీరారెడ్డి పాత్రలో రఘు కుంచె గారు నటించారు. ఆయన ఆ ప్రాంతంలో మంచి పేరున్న వ్యక్తి. ఆయనకు కూతురు, కొడుకు ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు, వాళ్ల ఇంటి డ్రైవర్ కొడుకు. ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీళ్ల బాల్యంలో జరిగిన సన్నివేశాలు చూపిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. కాసేపటికే వాళ్లు పెద్దవాళ్లు కావడం, మెయిన్ స్టోరీలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్తాం. ఆ ముగ్గురి స్నేహితులు ఎందుకు విడిపోవాల్సివచ్చింది అనేది ఆకట్టుకునే భావోద్వేగాలతో సాగుతుంది.
– “దేవగుడి” మూవీలో 11 నిమిషాల ఒక స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తూ వెళ్లాం. ఎక్కడా మూవీ ల్యాగ్ అనిపించదు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్ గా ఉంటుంది. సినిమాలోని ఒక్కో సీన్ అలా వెళ్తూ ఉంటుంది. మంచి సాంగ్స్ ఉంటాయి. మదీన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు. మా “దేవగుడి” మూవీకి నార్మల్ టికెట్ రేట్స్ పెడుతున్నాం. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాం.
నటుడు రఘుకుంచె మాట్లాడుతూ
– ఈ నేను దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. ఎక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని దర్శకుడు స్క్రిప్ట్ రాశారో అక్కడే షూటింగ్ చేశాం. దర్శకుడిగా, నిర్మాతగా బెల్లం రామకృష్ణా రెడ్డి గారు ఆయన జాబ్ పర్పెక్ట్ గా చేశారు. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. అలాగే దర్శకుడిగా ప్రతి సీన్ చాలా క్లారిటీగా రూపొందించారు.
– నేను జీబులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. నాకు రియల్ లైఫ్ లో అలాంటి సందర్భం రాదు కదా. కాబట్టి వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని రోజూ ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది.
– స్నేహం, ప్రేమ, పగ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ ఆకట్టుకునేలా సాగుతుంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా దాన్నొక బ్యాక్ డ్రాప్ లా మాత్రమే పెట్టుకున్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డెడికేషన్ తో వర్క్ చేశారు. సెట్ కు వెళ్లే సరికి ప్రతీది రెడీగా ఉండేది. లోకల్ ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. ఈ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేసి పాడాను. మదీన్ మంచి సాంగ్స్ చేశాడు. అతనికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫ్యూచర్ ఉంటుంది.
– యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా.






