Nara Lokesh:ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకే మేం ఉన్నాం : మంత్రి లోకేశ్
పేదరికం లేని సమాజం కోసం మన ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అమరావతి (Amaravati)లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ వివిధ అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం పాటించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. పార్టీలో మహిళలను గౌరవించాలని సూచించారు. పార్టీపై నిబద్ధత ఉన్నవాళ్లకే పార్లమెంట్ కమిటీల్లో బాధ్యతలు అప్పగించాం. 83 శాతం మంది కొత్తవారికి చోటు కల్పించాం. చంద్రబాబు (Chandrababu) నేతత్వంలోని మనమంతా ఆయన సైనికులం, తోట చంద్రయ్య (Thota Chandraiah) , మంజుల, అంజిరెడ్డి లాంటి ఎందరో కార్యకర్తలు మనందరికీ స్ఫూర్తి. మాట మార్చడం, మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదు. సంక్షేమం, అభివద్ధి జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని నిరంతరం తపించే నాయకుడు ఆయన. పార్టీలో యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరముందన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
టీడీపీ, జనసేన, బీజేపీతో కూటమి ఏర్పడింది. మూడు పార్టీల కలయిక అన్నప్పుడు చిన్నచిన్న విభేదాలు ఉంటాయి కాదనట్లేదు. ఇలాంటి సమస్యలను పార్లమెంట్ కమిటీల్లోని నాయకులు పరిష్కరించాలి. పార్టీల మధ్య విభేదాలు సష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తారు. అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి. నియోజకవర్గాల్లో సమస్య ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత గ్రామ పార్టీ అధ్యక్షుడి నుంచి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిపై ఉంటుంది. చంద్రబాబు పై పనిచేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పు రావాలి. ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మేం ఉన్నాం. కార్యకర్తలకు శిక్షణ కోసం విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.






