Yuvagalam Padayatra :మంత్రి నారా లోకేశ్ కు పలువురు నేతల శుభాకాంక్షలు
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ప్రారంభించి నేటికి మూడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో (NTR Bhavan) ఘనంగా సంబరాలు చేసుకున్నారు టీడీపీ నేతలు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌కు (Nara Lokesh) టీడీపీ నేతలు పెద్దఎత్తున శుభాకాంక్షలు (wishes) తెలిపారు. యువగళం పాదయాత్ర మూడేళ్ల సందర్భాన్ని గుర్తుచేస్తూ లోకేశ్‌తో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని ఆ పార్టీ నేతలు కొనియాడారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మున్సిపాలిటీలు /మండలాలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. లోకేశ్ పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర విజయానికి నిదర్శనంగా నిలిచింది.లోకేశ్‌కు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్లు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనిత, సవిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, సోమిరెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, ఉగ్ర నరసింహారెడ్డి, గణబాబు, ఆదిరెడ్డి వాసు, ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి, వేపాడ, గ్రీష్మ, కార్పొరేషన్ ఛైర్మన్లు, తదితరులు అభినందనలు తెలియజేశారు.






