Minister Ponguleti: అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు …మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో బీఆఎర్ఎస్ (BRS) నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిన కాంగ్రెస్ (Congress) పట్ల విషం చిమ్ముతున్నారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Srinivas Reddy) విమర్శించారు. వర్ధన్నపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మినీ స్టేడియం, ఓపెన్ జిమ్ సెంటర్, సబ్ జైలు, మునిసిఫ్ కోర్టు, డ్రైనేజీ, సీసీ రోడ్లు సుమారు రూ.294కోట్ల అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. ఆనాటి ప్రభుత్వంలో రూపొందిన మంచి పథకాలను కొనసాగిస్తూ ముం దుకు సాగుతున్నామని తెలిపా రు. రాబోయే ఏప్రిల్ నెలలో మళ్లీ కొత్త ఇళ్లు మంజూరి చేయడంతో పాటు అవి కాక మరో మూడుసార్లు ఇళ్లు మంజూరీ చేస్తామన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






