Minister Komatireddy: విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం : మంత్రి కోమటిరెడ్డి
సరైన విద్యతోనే పేదిక నిర్మూలన సాధ్యమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. విద్య (Education)కు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నల్గొండలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో ప్రతీక్ ఫౌండేషన్ (Prateek Foundation) ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినా తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (Integrated Schools) నిర్మిస్తున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు పాఠశాలల్లోనే చదివించి మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






