Jagga Reddy: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలిస్తే ఊరుకోను : జగ్గారెడ్డి
సంగారెడ్డి జిల్లా, పట్టణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పేరుతో పటాన్చెరు (Patancheru)లోని కర్ధనూర్కు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు దామోదర రాజనర్సింహ (Damodara Rajanarasimha), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)తో తాను మాట్లాడేవరకు తరలింపు ఆలోచన చేయొద్దన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఇది తన సూచన, హెచ్చరిక అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






