INDIA-EU FTA: దర్ ఆఫ్ డీల్స్..భారత్-ఈయూ సంబంధాల్లో గొప్ప ముందడుగు..!
భారత్-యూరోపియన్ యూనియన్ చారిత్రాత్మక ముందడుగు వేశాయి. మైలురాయి లాంటి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేశాయి. రెండు దశాబ్దాల పాటు జరిగిన చర్చల తర్వాత, ఈ ఒప్పందం .. ఎట్టకేలకు పట్టాలెక్కింది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన ఇండియా.. తన అతిపెద్ద భాగస్వామి…27 దేశాల యూరోపియన్ యూనియన్ కోసం తన మార్కెట్ ద్వారాలను తెరిచిందని చెప్పవచ్చు
ఇండియా-ఈయూ చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేశాయన్నారు ప్రధాని మోడీ. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ మదర్ ఆఫ్ డీల్స్ గా పిలుస్తున్నారని గుర్తు చేశారు.ఈ ఒప్పందం భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు .. యూరప్ వాసుల మధ్య అవకాశాలను అనుసంధానం చేస్తుందన్నారు మోడీ. న్యూఢిల్లీలో ఇండియా-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో మోడీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఒప్పందం వివరాలతో సహా సంయుక్త ప్రకటన చేయనున్నారు..
మార్చి 2025 వరకు భారతదేశం – EU మధ్య వాణిజ్యం $136.5 బిలియన్లుగా ఉంది.గత సంవత్సరం ఇండోనేషియా, మెక్సికో మరియు స్విట్జర్లాండ్లతో ఒప్పందాల తరువాత, EU …దక్షిణ అమెరికా బ్లాక్ మెర్కోసూర్తో కీలకమైన ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది..
ఇండియా సైతం.. బ్రిటన్, న్యూజిలాండ్ , ఒమన్లతో ఒప్పందాలను ఖరారు చేసింది.”ఈ ఒప్పందం ఒక సంవత్సరం లోపు అమలులోకి వస్తుందని మేము ఆశిస్తున్నాము” అని భారతీయ అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతు మరియు ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతును సూచిస్తుంది.






