Kondapalli Srinivas: వైరల్ గా మారిన మంత్రి గారి రిప్లై..!
రాజకీయాలకు సోషల్ మీడియాకు దగ్గరి అనుబంధం ఉంది. మనం ఎంత పని చేసినా, సోషల్ మీడియాలో వచ్చే సమస్యలకు స్పందిస్తే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు, వాటి పరిష్కారానికి కృషి చేసినట్టు. అందుకే శాఖా పరంగా ఎంత కష్టపడినా, సోషల్ మీడియాపై ఓ కన్నేశారు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ముఖ్యంగా పెన్షన్ లకు సంబంధించిన సమస్యలపై సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది. అధికారుల తప్పిదాల కారణంగా ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటాయి.
తాజాగా ఓ యువకుడికి పెన్షన్ విషయంలో సమస్య మంత్రి దృష్టికి వచ్చింది. బిగ్ బాస్ 6 లో ఫైనల్ కు వెళ్ళిన ఆదిరెడ్డి అనే యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాలో(X) ఓ పోస్ట్ చేసాడు. వికలాంగ యువకుడికి పెన్షన్ ఇప్పించాలని చేసిన పోస్ట్ కు స్వయంగా మంత్రి స్పందించారు. వెంటనే సమస్యపై సంబంధిత అధికారులతో మాట్లాడారు కొండపల్లి. పెన్షన్ ఆగిపోవడానికి గల పూర్తి కారణాలు తెలుసుకుని, సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఆదిరెడ్డికి డైరెక్ట్ గా మినిస్టర్ రిప్లై ఇచ్చారు.
దీనితో టీడీపీ(TDP) కార్యకర్తలు ఖుషీ అయిపోయారు. మంత్రి గారి పని తీరుని ప్రశంసిస్తూ వరుస పోస్ట్ లు చేస్తున్నారు కార్యకర్తలు. వాస్తవానికి సదరు పోస్ట్ ను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కు ట్యాగ్ చేయగా, సంబంధిత శాఖ కావడంతో కొండపల్లి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. గణతంత్ర(Republic Day) వేడుకల్లో బిజీగా ఉన్నప్పటికీ మంత్రి చూపించిన చొరవను పలువురు ప్రసంశిస్తున్నారు. గతంలో కూడా పలువురి సమస్యలకు మంత్రి ఇదే విధంగా రియాక్ట్ అవుతూ ఉండేవారు. ఇక ప్రజలకు కావాల్సింది ఇటువంటి నాయకత్వమే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






