O Sukumari: ‘ఓ..! సుకుమారి’ నుంచి యాదగిరి గా తిరువీర్ ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ (O Sukumari) చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే దామిని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు తిరు వీర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్‌లో తిరు వీర్ రగ్గడ్, మాస్సీ విలేజ్ క్యారెక్టర్‌గా యాదగిరిగా పరిచయమయ్యారు. విలేజ్ లో నడుచుకుంటూ వస్తున్న ఆయన లుక్ వెంటనే అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. స్లీవ్‌లెస్ బనియన్, కట్టుకున్న లుంగీ, భుజాలపై వేసుకున్న తువ్వాలు మొత్తంగా ఒక ఎర్తీ, అన్ఫిల్టర్డ్ ఫీల్‌ను క్యాప్చర్ చేశాయి. కర్లీ హెయిర్, గడ్డం, నోట్లో టూత్‌బ్రష్ వంటి డీటెయిల్స్ క్యారెక్టర్‌కు రా, లైవ్డ్-ఇన్ ఆథెంటిసిటీని తీసుకొచ్చాయి. ఇక ఆయన నడక, బాడీ లాంగ్వేజ్ మొత్తం యాదగిరి అటిట్యూడ్‌ను స్ట్రాంగ్‌గా ప్రొజెక్ట్ చేస్తూ, ఫస్ట్ లుక్‌తోనే క్యారెక్టర్‌పై క్యూరియాసిటీని పెంచాయి.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.
‘ఓ..! సుకుమారి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






