Chiranjeevi: పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు: మెగాస్టార్ చిరంజీవి
పద్మ అవార్డు గ్రహీతలందరికీ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆయన అభినందనలు తెలియజేశారు.
విశిష్ట వ్యక్తులను సత్కరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
శ్రీ ధర్మజీ గారి పద్మ విభూషణ్, మై డియర్ మమ్ముట్టీ గారు, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి లభించిన పద్మ భూషణ్.. ఇవన్నీ దశాబ్దాల పాటు వారు చూపిన అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవం.
మిత్రులు మురళీ మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సోదరుడు మాధవన్ గారు, మన చాంపియన్ రోహిత్ శర్మ, అలాగే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.
కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలకు నా హృదయపూర్వక అభినందనలు.






