New Jersey: న్యూజెర్సీ టర్న్‌పైక్ అథారిటీ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా క్రిస్ కొల్లూరి..
NJ TRANSIT అధ్యక్షుడు మరియు CEO అయిన క్రిస్ కొల్లూరి మరో ఘనత సాధించారు. గవర్నర్ మికీ షెర్రిల్…. NJ TRANSIT అధ్యక్షుడు, CEO అయిన క్రిస్ కొల్లూరిని న్యూజెర్సీ టర్న్‌పైక్ అథారిటీ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. రాష్ట్ర రవాణా మరియు హైవే కార్యకలాపాలను సజావుగా నిర్వహించడం, ప్రణాళికల అమలు కంటిన్యూ చేయడం, 2026 FIFA ప్రపంచ కప్‌కు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, కొల్లూరి టర్న్‌పైక్ పాత్రకు.. $1 జీతం మాత్రమే తీసుకుంటారు. అయితే.. $280,000 NJ TRANSIT స్థానాన్ని నిలుపుకుంటున్నారు.
క్రిస్ కొల్లూరి నేపథ్యం..
2026 ప్రపంచ కప్ సమయంలో అధిక ట్రాఫిక్ జామ్స్ ఏర్పడకుండా ప్రయత్నించడం ..కీలకమైన NJ ట్రాన్సిట్ – టర్న్‌పైక్ అథారిటీ మధ్య సరైన సహకారాన్ని నిర్ధారించడానికి ఈ చర్య ఉపకరించనుంది.
2006-08 మధ్య కొల్లూరిట న్యూజెర్సీ రవాణా కమిషనర్ (2006–2008) మరియు గేట్‌వే డెవలప్మెంట్ కమిషన్ యొక్క CEOగా పనిచేశారు, అక్కడ ఆయన $16.1 బిలియన్ల హడ్సన్ టన్నెల్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించారు. ప్రాంతీయ ప్రయాణాన్ని మెరుగుపరచడం, రవాణా రంగాల మధ్య ఏకీకృత సామర్థ్యం మరియు మెరుగైన కమ్యూనికేషన్‌పై దృష్టి పెట్టడం కొల్లూరి లక్ష్యాలుగా ఉన్నాయి.
భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించి, రట్జర్స్ విశ్వవిద్యాలయం .. జార్జ్‌టౌన్ లా గ్రాడ్యుయేట్ అయిన కొల్లూరి, రాష్ట్ర స్థాయి రవాణా నిర్వహణ మరియు సమాఖ్య విధానం రెండింటిలోనూ విస్తృతమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ రెండు విభాగాలను కొల్లూరి క్రిస్ … సమర్థవంతంగా నిర్వహిస్తారంటూ గవర్నర్ షెర్రిల్ హైలెట్ చేశారు.






