Mahesh Kumar : ఆ పార్టీ కుట్రలను ప్రజలను అర్థం చేసుకోవాలి : మహేశ్ కుమార్ గౌడ్
కేంద్రంలో 2014 వరకు యూపీఏ ప్రభుత్వం (UPA government) తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు తొలగిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. గాంధీభవన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని, లౌక వాదానికి తూట్లు పొడిచే కుట్రలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో కేసీఆర్ (KCR) హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ సూచనలతో ముందుకెళ్తున్నాం. సీఎం రేవంత్ (CM Revanth) రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నారు. కులగణన సర్వేతో దేశంలోని అన్ని రాష్ట్రాలూ తెలంగాణ వైపు చూస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. కులగణన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోంది. ఆ పార్టీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






