Weight Loss: బరువు తగ్గాలంటే నడక మేలా లేక పరుగు మంచిదా? కేలరీలు కరగాలంటే అసలు ఏం చేయాలో తెలుసా?
హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీర బరువును అదుపులో ఉంచుకోవాలన్నా వ్యాయామం తప్పనిసరి. అయితే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే.. బరువు తగ్గడానికి నడక మంచిదా లేక పరుగు మంచిదా? వాస్తవానికి ఈ రెండూ గుండె ఆరోగ్యానికి, ఫిట్నెస్కు మేలు చేసేవే అయినప్పటికీ, మీ లక్ష్యాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి.
కేలరీలు: ఏది వేగంగా పనిచేస్తుంది? తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వారికి పరుగు ఉత్తమ ఎంపిక. ఉదాహరణకు, అర గంట పాటు పరిగెత్తితే సుమారు 365 కేలరీలు ఖర్చవుతాయి, అదే సమయంలో నడక ద్వారా కేవలం 187 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. అంటే సమయం తక్కువగా ఉన్నప్పుడు పరుగు ద్వారా ఎక్కువ కేలరీలను కేలరీలను కరిగించవచ్చు.
కొవ్వు కరగాలంటే నడకే మేలు. పరుగులో కేలరీలు ఎక్కువగా ఖర్చయినప్పటికీ, నడకలో శరీరం తన శక్తి కోసం ప్రాథమికంగా కొవ్వునుఇంధనంగా వాడుకుంటుంది. తక్కువ తీవ్రతతో చేసే ఈ వ్యాయామం వల్ల దీర్ఘకాలికంగా శరీరంలోని మొండి కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది.
భోజనం తర్వాత ఏం చేయాలి?
భోజనం చేసిన వెంటనే పరుగు తీయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. కానీ, భోజనం తర్వాత కాసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరించి, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది.
మీరు దేనిని ఎంచుకోవాలనేది మీ శరీర తత్వం, ఓపికపై ఆధారపడి ఉంటుంది. పరుగు వేగంగా ఫలితాలను ఇస్తుంది, కానీ నడక సురక్షితమైనది , ఎక్కువ కాలం పాటు అలసట లేకుండా చేయగలిగేది. బరువు తగ్గడమే లక్ష్యమైతే మీరు తీసుకునే ఆహారం కంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేయడంపై దృష్టి పెట్టాలి.






