Ramachander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే: రామచందర్ రావు
గణతంత్ర వేడుకల్లో భాగంగా బీజేపీ కార్యాలయం (BJP office)లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు (Ramachander Rao) జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రామచందర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయింది. అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది. వీబీ జీ రామ్ జీ పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలే అని విమర్శించారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, మేముల అశోక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.






