At home: లోక్ భవన్ లో సందడిగా ఎట్ హోమ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్సభవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. అతిథులకు గవర్నర్ అబ్దుల్‌నజీర్ (Abdul Nazir) తేనీటి విందునిచ్చారు. లోక్‌భవన్ ఆవరణలోని లాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టేబుల్ దగ్గర గవర్నర్‌కు కుడివైపు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూర్చున్నారు. గవర్నర్‌కు ఎడమవైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్, ఆయన సతీమణి గుడియా ఠాకూర్, గవర్నర్ సతీమణి సమీరా నజీర్, సీఎం సతీమణి భువనేశ్వరి, ఉపముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజినోవా కూర్చుకున్నారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కార్యక్రమానికి వచ్చి కాసేపు ఉండి, వెళ్లిపోయారు. ఆయనతోపాటు వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా ఉన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






