Anil Ravipudi: అనిల్ నెక్ట్స్ సీక్వెల్ ఎందుకు కాదంటే?
టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil ravipudi) ఈ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో కలిసి మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu) రూపంలో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు అనిల్ కెరీర్లో వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్లుగా నిలిచినవే. దీంతో ఈ మెగా విక్టరీ తర్వాత అనిల్ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అనేది తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే అనిల్ తర్వాతి సినిమాను విక్టరీ వెంకటేష్(Venkatesh) తో చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు రాగా, ఆ నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచినవే. ఇప్పుడు వీరి కాంబోలో ఐదవ సినిమా రాబోతుందంటే అందరికీ దానిపై అంచనాలు మామూలుగా ఉండవు. పైగా ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam)కు సీక్వెల్ అయ్యే అవకాశాలుండటంతో ఆ అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
కానీ అనిల్ మాత్రం తన తర్వాతి సినిమా కొత్త కథగా వస్తుందని, అది సీక్వెల్ కాదని వెల్లడించాడు. దీంతో సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు చేయడం లేదనేది ప్రశ్నగా మారింది. దానికి కారణం అనిల్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేస్తే దిల్ రాజు(Dil raju) బ్యానర్ లో చేయాలి కానీ ప్రస్తుతం తాను సాహు గారపాటి(Sahu garapati) బ్యానర్ లో సినిమా చేయాలనుకోవడంతో ఈసారి కొత్త కథతో రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.






