GATeS: గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 2026 కార్యవర్గ ప్రకటన
అట్లాంటా: ప్రవాస తెలంగాణీయుల ప్రముఖ సంస్థ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) 2026 సంవత్సరానికి సంబంధించిన కమిటీ ఛైర్మన్లు, కో-ఛైర్మన్ల బృందాన్ని అధికారికంగా ప్రకటించింది. సేవా, సంస్కృతి, ఐక్యత అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ, అట్లాంటాలోని తెలంగాణ సమాజానికి మరింత చేరువయ్యేలా ఈ కొత్త బృందాన్ని ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, నాయకత్వ పటిమ, సేవా దృక్పథం కలిగిన స్వచ్ఛంద సేవకులతో ఈ టీమ్ సిద్ధమైందని తెలిపారు. వీరు వచ్చే ఏడాది పొడవునా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక వేడుకలు, సామాజిక కార్యక్రమాలు, కమ్యూనిటీ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతి ఛైర్మన్, కో-ఛైర్మన్‌కు సంస్థ ధన్యవాదాలు తెలియజేసింది. అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా కమ్యూనిటీని మరింత బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన GATeS టీమ్ 2026కు సభ్యులు, ప్రవాస భారతీయులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
GATeS 2026 బృందంలోని కొందరు సభ్యులు:
ఛైర్మన్లు, కో-ఛైర్మన్లు:
ఆనంద్ బుక్కా
గిరీష్ కుమార్ పినుమళ్ల
రాజీబ్ ముఖర్జీ
అరవింద్ కనపర్తి
రాధాకృష్ణ చాట్ల
ప్రవీణ కొమ్మిడి
కమల కురిచేటి
నర్సింగ్ రావు వత్నాల
సుష్మ కొండపల్లి
శ్రీనివాస్ వేముల
అనిల్ చింతల
అరుణ్ కవేటి
వినయ్ బాలగోని
గణేష్ వల్లూరి
వేణు తిరు
శేఖర్ గుడి
ప్రకాష్ పనుగంటి
శ్రీనివాస్ గార్లపాటి
రాజేష్ బెల్డె
సురేష్ మేకల
రాజశేఖర్ రెడ్డి మల్లెల
శ్యామ్ కొప్పు
ప్రశాంత్ వీరబొమ్మ
స్వాతి కమరాజు
రాజు కరిమిండ్ల
శాలిని కర్నే
స్నేహ గడ్డం
జీవన్ బొడిగం
సాయి నల్లపాటి
హేమంత్ తెల్లూరి
వీరితో పాటు పలువురు సభ్యులు కూడా ఈ కమిటీలో భాగస్వాములుగా ఉన్నారు.






