Jr NTR: ఎన్టీఆర్ పేరు, బిరుదులను వాడితే ఇక జైలుకే.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులను కాపాడుతూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన పేరు, ఇమేజ్, బిరుదులను కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వాడుకుంటున్నారని ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది.
కోర్టు ఉత్తర్వులు:
పేర్లు, బిరుదుల రక్షణ: ఇకపై NTR, జూనియర్ ఎన్టీఆర్, తారక్ వంటి పేర్లతో పాటు.. ఆయనకు ఉన్న ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’, ‘యంగ్ టైగర్’ వంటి బిరుదులను ఆయన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపార ప్రకటనలకు లేదా వాణిజ్య లాభాల కోసం ఉపయోగించకూడదు.
దుర్వినియోగంపై నిషేధం: ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన గొంతును (Voice), రూపాన్ని (Likeness) లేదా సంతకాన్ని వాడటం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా ఉన్న పోస్టులను లేదా ప్రచారాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
ఈ తీర్పుతో సెలబ్రిటీల వ్యక్తిగత గుర్తింపును ఇష్టారాజ్యంగా వాడుకునే సంస్థలకు గట్టి హెచ్చరిక అందినట్లయింది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కులను పొందారు.






