NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
హైదరాబాద్: నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘దేవర’ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2024లో విడుదలైన ‘దేవర-1’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, క్లైమాక్స్‌తో పార్ట్-2పై భారీ అంచనాలను పెంచేసింది. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో తాజాగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని స్పష్టతనిచ్చారు.
నందిగామలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దేవర-2 షూటింగ్ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది (2026) మే నెల నుంచే దేవర-2 చిత్రీకరణ ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, 2027లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ (NTR 31) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, మే నెల నుండి తారక్ దేవర-2 సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.






