Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్‌భీర్ కపూర్
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌భీర్ కపూర్ తన ఇష్టమైన నటి రాణీ ముఖర్జీ 30 వసంతాల ప్రస్థానాన్ని మర్దానీ 3 సినిమాతో సెలబ్రేట్ చేయటానికి భారతీయ సినీ పరిశ్రమ కలిసి ముందుకు రావటం చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రణ్‌భీర్ కపూర్ డెబ్యూ మూవీ సావరియాలో రాణీ ముఖర్జీతో కలిసి నటించారు. ఈ సినీ ప్రయాణంలో క్లిష్ట సమయాల్లో ఆమె అతనికి తోడుగా నిలిచింది. అందుకనే రాణి ప్రయాణంలో, ప్రతి సినిమా సక్సెస్ కావాలని రణ్‌భీర్ కోరుకుంటుటుంటాడు.
ఈ సందర్భంగా రణ్‌భీర్ కపూర్ మాట్లాడుతూ ‘‘రాణీ ముఖర్జీ సావరియా చిత్రంలో నాతో కలిసి నటించారు. నేనెంతో కష్టపడి నటించానని నాకు చెప్పి ప్రోత్సహించిన మొదటి వ్యక్తి తనే. నాకు, ఆమె జరిగిన సంభాషణను నేను మరచిపోలేను. నాకు అవసరమైన సమయంలో ఆమె మాటలు నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. నేను ఆమెను దగ్గరగా గమనించాను. నేను ఆమె వర్క్‌ను చాలా దగ్గరగా గమనించాను. ఆమె గ్రేస్, ఛార్మ్, తెలివితేటలకు ముగ్ధుడినయ్యాను. రాణీ ముఖర్జీ తన 30 ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవటం నిజంగా అద్భుతం. ఆమె ఎప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తిగా నేను భావిస్తాను. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. మన ఇండస్ట్రీ ఏంటో ఆమె తన పనితనంతో నిర్వచించారు. ఆమె ఎంచుకునే సినిమాలు, పాత్రలు ఇప్పుడు స్క్రీన్‌పై మహిళలను చూపించే విధానాన్ని మార్చాయి.
రాణీ తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలనుకున్నారు. ఆమె మనకు అందించిన సినిమాలు, వాటి తీపి గుర్తులను మనం మరచిపోలేం. అందుకు ఆమెకు ధన్యవాదాలు. మనల్ని నటనతో మెప్పించటానికి, సంతోషపరచటానికి జీవితాన్ని ఇచ్చిన ఎంటరటైనర్ ఆమె. ఆమె సినిమాలు నాపై చూపిన ప్రభావాన్ని మాటల రూపంలో చెప్పలేను’’ అన్నారు.
రాణీ ముఖర్జీ మర్దానీ 3 ఇప్పుడు సోషల్ మీడియాలో, నెట్టింట తెగ వైరల్ అవుతోన్న సినిమా, అందరి నోట ఆ సినిమా గురించే. మర్దానీ ఫ్రాంచైజీ విషయానికి వీటిలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూపించారు. ఇప్పుడు పేద కుటుంబాల్లోని 8 నుంచి 9 ఏళ్ల చిన్నమ్మాయిలను కొందరు ఓ కారణంతో కిడ్నాప్ చేస్తున్నారనే అంశాన్ని చూపించబోతున్నారు.
అభిరాజ్ మినావాల దర్శకత్వంలో, ఆదిత్య చోప్రా నిర్మించిన మర్దానీ 3 సినిమా సామాజిక సమస్యలను చూపించే సినిమాల పరంపరను కొనసాగిస్తోంది. తొలి భాగం మనకు హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క భయంకర నిజాలను చూపిస్తే.. మర్దానీ 2 సీరియల్ రేపిస్ట్ మానసికతను, వ్యవస్థను సవాళ్లు ఇచ్చే పరిస్థితిని ఆవిష్కరించింది. ఇప్పుడు మర్దానీ 3 మన సమాజంలో మరో చీకటి, భయంకర నిజాన్ని చూపించబోతున్న పవర్ఫుల్ కథాంశంతో మన ముందుకు రానుంది.






