CATS: మార్చి 8న ఘనంగా క్యాట్స్ మహిళా దినోత్సవ వేడుకలు
గైథర్స్బర్గ్: రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. “మహిళల శక్తి, ధైర్యం, సామర్థ్యాన్ని వేడుక చేసుకుందాం” అనే నినాదంతో మార్చి 8, ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. మేరీల్యాండ్‌లోని గైథర్స్బర్గ్ నగరంలో గల అప్పర్ కౌంటీ కమ్యూనిటీ రిక్రియేషన్ సెంటర్లో ఈ వేడుకలు కేవలం మహిళల కోసం మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖ మహిళలకు సన్మానం, స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఉంటాయి.
వినోద కార్యక్రమాల్లో భాగంగా ఆటలు, సంగీతం, నృత్యం, ఫ్యాషన్ షో, రాఫెల్ డ్రా వంటివి ఏర్పాటు చేశారు. హాజరైన వారందరికీ రుచికరమైన విందు భోజనంతో పాటు రిటర్న్ గిఫ్ట్‌లు కూడా అందజేయనున్నారు. ఈ ఈవెంట్లో కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉందని, ఫిబ్రవరి 22లోపు నమోదు చేసుకున్న వారికి ‘ఎర్లీ బర్డ్’ డిస్కౌంట్ వర్తిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు రమణి (410-260-0094) లేదా మహిత (302-690-7257)లను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.






