Telugu Cinema Day: ఫిబ్రవరి 6వ తేదీ తెలుగు సినిమా దినోత్సవం సందర్భంగా సన్మానం
ఫిబ్రవరి 6వ తేదీ తెలుగు సినిమా దినోత్సవం సందర్భంగా “ఫిల్మీడియా ప్రొడక్షన్స్ మరియు AI స్టూడియో “వారి ఆఫీసులో” సీనియర్ జర్నలిస్ట్, సినీ పాత్రికేయ రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం గడించిన సినీ చరిత్ర పరిశోధకుడు, శ్రీ వినాయక రావు గారిని, సీనియర్ దర్శకులు మాతృదేవోభావ ఫేమ్ శ్రీ కే అజయ్ కుమార్ సత్కరించారు. తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదకు దర్శకత్వం వహించిన హెచ్ఎం రెడ్డి గురించి అద్భుతమైన పుస్తకం రాసిన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రచయిత శ్రీ హెచ్. రమేష్ బాబు ని ఈ సందర్భంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అల్లాని శ్రీధర్ పాల్గొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమం తమ స్టూడియో ఆఫీసులో జరగడం ఆనందంగా ఉందని అల్లాణి శ్రీధర్ అన్నారు. తెలుగు సినిమా డే ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న జరుపుకుంటారు. 1932 ఫిబ్రవరి 6న మొదటి సంపూర్ణ తెలుగు టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలైన సందర్భంగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆవిర్భావానికి గుర్తుగా ఈ తేదీని అధికారికంగా వేడుక చేసుకుంటున్నారు. ఇది టాలీవుడ్ చరిత్ర, అభివృద్ధిని గుర్తుచేసుకునే దినం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముఖ్యమైన అంశాలు:
చారిత్రక సందర్భం: ‘భక్త ప్రహ్లాద’ (1932) చిత్రానికి ముందు, 1931లో ఈ సినిమా నిర్మాణం పూర్తయినప్పటికీ, ఫిబ్రవరి 6న బొంబాయిలో విడుదలైనందున అదే రోజున వేడుకలు నిర్వహిస్తారు.
ప్రాముఖ్యత: తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క సుదీర్ఘ ప్రయాణం, సాంకేతిక పరిణామాలను మరియు సీనియర్ కళాకారులను గౌరవించే రోజు.






