Itlu Arjuna: వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ ‘ఇట్లు అర్జున’- ఫైండింగ్ అర్జున వాల్యూమ్1′
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల ‘ఇట్లు అర్జున’తో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు, వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఇది అతని మొదటి వెంచర్. ‘న్యూ గై ఇన్ టౌన్’ అనిష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో, అనస్వర రాజన్ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్‌తో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. అనిష్ పుట్టిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్, వీడియో విడుదల చేశారు.
పోస్టర్లో అనీష్ కూల్ అండ్ చార్మింగ్‌గా కనిపించారు. కొత్తగా విడుదలైన వీడియోతో మేకర్స్ ఆ పాత్ర వెనుక ఉన్న యాక్టర్ పై ఫోకస్ చేశారు. ఫైండింగ్ అర్జున వాల్యూమ్ 1 వీడియో ఒక క్యారెక్టర్‌ను పరిచయం చేయడమే కాదు — ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి అనీష్ చూపించిన కమిట్మెంట్ మైండ్‌సెట్‌ను ఆవిష్కరిస్తుంది. అర్జున్ మూగవాడు, సంభాషణలపై ఆధారపడకుండా, పూర్తిగా బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ డెప్త్తోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన పాత్ర ఇది. కొత్త నటుడికి ఇది ఒక పెద్ద సవాలు. కానీ అనీష్ దీన్ని ఒక సవాలుగా కాకుండా, తన నటనా పరిధిని విస్తరించుకునే అవకాశంగా స్వీకరించిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఆడిషన్ సమయంలోనే అనీష్ టీమ్‌ను ఇంప్రెస్ చేయడం, పాత్రను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కూడా అదే ఉత్సాహంతో ముందుకు రావడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు ప్రత్యేకంగా ప్రిపరేషన్ దశను దాటాడు. అర్జున్ ఎమోషనల్ జర్నీని లోతుగా అధ్యయనం చేయడం, షూటింగ్‌కి ముందే పాత్రను ఇంటర్నల్ గా స్వీకరించడం… ఇవన్నీ అతని కమిట్మెంట్ను చాటిచెబుతున్నాయి.
ఫైండింగ్ అర్జున వాల్యూమ్ 1 అనీష్‌ను మరో డెబ్యూ నటుడిగా మాత్రమే కాదు తన కళపై ఉన్న నిజాయితీని, నటన ద్వారానే తనను తాను నిరూపించుకోవాలనే తపనను ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రాజా మహదేవన్ నిర్వహిస్తున్నారు,
అనీష్ కేవలం అర్జున్ పాత్రలో నటించలేదు, అర్జున్‌గా మారేందుకు పూర్తిగా తనను తాను సిద్ధం చేసుకున్నాడని అర్జున వాల్యూమ్ 1 వీడియో స్పష్టం చేస్తోంది.






