Revanth Reddy: కానిస్టేబుల్ సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు ప్రభుత్వ సాయం
రూ. కోటి చెక్కులను అందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
ఇటీవల విధి నిర్వహణలో మరణించిన తెలంగాణ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది. దీంతోపాటు, గత సంవత్సరం అక్టోబరు డ్యూటీ చేస్తుండగా దుండగుల చేతిలో కత్తి పోటుకి గురై మృత్యవాత పడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్-గ్రేషియా ఇచ్చారు. ఈ సహాయానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా నిజామాబాద్‌లో ఆ కుటుంబాలకు స్వయంగా అందజేశారు.
నిజామాబాద్‌లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్‌లో సౌమ్యకు చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం విదితమే.






