TASA: ఫిబ్రవరి 28న టాసా వాలీబాల్ టోర్నమెంట్
శాన్ ఆంటోనియో: శాన్ ఆంటోనియో తెలుగు సంఘం (TASA) క్రీడాభిమానుల కోసం ఉత్సాహభరితమైన వాలీబాల్ టోర్నమెంట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రీడా వేడుక ఫిబ్రవరి 28, శనివారం మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానుంది. శాన్ ఆంటోనియోలోని 4320 ఇండస్ట్రియల్ సెంటర్ వద్ద ఉన్న ‘ఆర్డర్ ఆన్ ది కోర్ట్’ (కోర్ట్స్ 1 & 2) లో ఈ పోటీలు నిర్వహిస్తారు.
ఈ టోర్నమెంట్లో పాల్గొనే ప్రతి జట్టు 80 డాలర్ల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జట్ల నమోదుకు ఫిబ్రవరి 21, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. జెల్లే (Zelle) ద్వారా ఫీజు చెల్లించి, ఆన్లైన్ లింక్ ద్వారా జట్టు వివరాలను సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అనిల్ సంఘుభట్ల (515-991-9535)ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. తెలుగు కమ్యూనిటీలోని క్రీడాకారులందరూ ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని టాసా ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు.






