Sri Chidambharam Garu: “శ్రీ చిదంబరం గారు” ఫీల్ గుడ్ మూవీగా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన “శ్రీ చిదంబరం గారు”. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా సినిమాలోని హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి.
– కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో “శ్రీ చిదంబరం గారు” చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా టీమ్ నాలుగేళ్లుగా కష్టపడుతున్నారు. క్రౌడ్ ఫండెడ్ మూవీగా స్టార్ట్ చేశారు. వీళ్ల కష్టం చూసి మా అమ్మాయి ఈ సినిమా చేయాలని ప్రపోజల్ నా దగ్గరకు తీసుకొచ్చింది. వాళ్లను చూస్తే జాలేసింది. అయితే ఈ టీమ్ పట్టుదలగా ఉన్నారు. తప్పకుండా హిట్ కొడతారనే నమ్మకం కలిగింది. కథ కూడా మాకు బాగా నచ్చింది. “శ్రీ చిదంబరం గారు” సినిమా ఫీల్ గుడ్ కథతో తెరకెక్కించారు. ఫైట్స్ యాక్షన్ గోల ఉండదు. ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చేసిన ఈ మూవీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్స్ కు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు వస్తారు. అలాంటి ప్లెజెంట్ కంటెంట్ ఈ మూవీలో ఉంది.
– సినిమా బాగా చేయండని సపోర్ట్ ఇస్తూ ఈ సినిమా టేకప్ చేశాం. రాజమండ్రిలో ఆఫీస్ తీసి, రెండు షెడ్యూల్స్ లో మారేడుమిల్లి ప్రాంతంలో 35 రోజులు, రాజమండ్రిలో 10 రోజులు షూటింగ్ చేశాం. మే దాటితే మారేడుమిల్లి ప్రాంతంలో వర్షాలు పడతాయి అని అక్కడి వాళ్లు చెప్పారు. వాళ్లు చెప్పినట్లే ఆ చుట్టు పక్కల వర్షాలు పడ్డాయి గానీ మా షూటింగ్ చేసే దగ్గర ఒక్క రోజు కూడా వర్షం పడలేదు. మనం అందమైన లొకేషన్స్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తుంటాం. కానీ మన దగ్గరే ఇంత అందమైన లొకేషన్స్ ఉన్నాయని ఈ సినిమాతో చూపించబోతున్నాం. స్థానిక ప్రజలు కూడా మా సినిమా షూటింగ్ కోసం చాలా సహకరించారు. మీరు ట్రైలర్ లో చూసినవి అక్కడ వారు నివసిస్తున్న ఇళ్లే. అక్కడే నేచురల్ గా మూవీ షూటింగ్ చేశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము మా తరంలో పాటలు బాగుంటేనే సినిమాకు వెళ్లేవాళ్లం. అలాంటి మంచి ఆడియో ఈ సినిమాకు కుదిరింది.
– “శ్రీ చిదంబరం గారు” సినిమా టైటిల్ ఫస్ట్ చిదంబరం. గౌరవంగా ఉంటుందని శ్రీ చిదంబరం గారు అని మార్చాం. సినిమాకు డిస్ట్రిబ్యూషన్ వంశీ నందిపాటి చేస్తున్నారు. ఓటీటీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు. కొత్త వాళ్ల మూవీ కాబట్టి ఓటీటీలు ఆసక్తి చూపవు. సినిమా రిలీజ్ అయ్యాక మా కంటెంట్ ఇది అని చూపించి ఓటీటీకి ఇవ్వాలనుకున్నాం. అలాగే విదేశాల్లో మా సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన లేదు. అయితే మా మూవీ కంటెంట్ చూసి ఓవర్సీస్ నుంచి కాల్స్ వచ్చాయి. అలా యూఎస్ యూకే ఇతర దేశాల్లో సినిమా రిలీజ్ కు ఇచ్చాం.
– ఇటీవల సెలబ్రిటీ షో నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా బాగుంటుందనే మేము నమ్మి చేశాం. మూవీ చూసిన వాళ్లు కూడా అదే విషయం చెబుతుంటే హ్యాపీగా ఉంది. మా సంస్థలో ప్రస్తుతం రావు బహద్దూర్ అనే పెద్ద ప్రాజెక్ట్ జరుగుతోంది. ఇంకో సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాం. మా చిత్ర నిర్మాణ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటాం. ఈవారం మా మూవీతో పాటు రిలీజ్ అవుతున్న చిత్రాలు కూడా ఆదరణ పొందాలి. మేము 2 గంటలు మంచి వినోదాన్ని అందించబోతున్నాం. టికెట్ రేట్ కూడా 99 రూపాయలే పెడుతున్నాం. మేము మట్టిలో మాణిక్యం లాంటి కథతో వస్తున్నాం. ఎక్కడా ప్రొడక్షన్ వ్యాల్యూస్ తగ్గకుండా సినిమా నిర్మించాం.
– మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే ఎవరికీ నష్టం రాదు. ఒక మేనేజర్ వర్క్ చేసినట్లు నిర్మాత కూడా కష్టపడాలి. అప్పుడే ప్రాజెక్ట్ బాగుంటుంది. ఈ రోజు కొన్ని వందల సినిమాలు రిలీజ్ కాకుండా పడి ఉన్నాయి. నేను కూడా ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటే అలాగే ఉండిపోతుంది. సినిమాకు పెట్టిన డబ్బులు వస్తే మరో సినిమా చేయడానికి వీలుంటుంది. మాకు కె విశ్వనాథ్ గారి లాంటి సినిమాలు నిర్మించాలని ఉంది. నా సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదు అనుకుంటా. ఆ నష్టం ఏదైనా ఉంటే నేనే భరిస్తా. క సినిమా సీక్వెల్ ను త్వరలో అనౌన్స్ చేస్తాం.






