Dr Rajsekhar: ‘బైకర్’ నుంచి బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా హై-ఆక్టేన్ స్పోర్ట్స్-ఫ్యామిలీ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ పాత్రను బుల్లెట్ సునీల్ గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
గ్లింప్స్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది. మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్ – ‘బుల్లెట్ సునీల్’గా పాపులర్. 18 ఇండియన్ ఛాంపియన్షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కుపైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. “ఇండియన్ రేసర్లు ఓడిపోయేవాళ్లే” అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్ సర్క్యూట్లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు.
గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. ఆ పాత్రకు రాజశేఖర్ ఇచ్చిన ఇంటెన్సిటీ, తపన, ఎమోషనల్ డెప్త్ ఆ ప్రయాణాన్ని మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి.
రాజశేఖర్ ఫియర్స్‌గా, మాగ్నెటిక్‌గా కనిపిస్తూ ప్రతి ఫ్రేమ్‌కు వెయిట్ తీసుకొచ్చారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర క్రియేట్ చేసిన హై-ఇంపాక్ట్ క్యారెక్టర్‌కు ఈ గ్లింప్స్ ఒక పవర్ ఫుల్ టీజర్లా నిలుస్తుంది.






