Erra Cheera: ‘ఎర్రచీర’ ట్రైలర్‌లోని షాట్‌ను అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: దర్శకుడు సుమన్ బాబు
ఫిబ్రవరి 6న ఎర్రచీర గ్రాండ్ రిలీజ్.. ‘బీ,సీ సెంటర్స్‌లో ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన మూవీ టీమ్
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ప్రింట్, వెబ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎర్రచీర – ది బిగినింగ్ ఒక విలక్షణమైన కథాంశంతో రూపొందిన సినిమా. మదర్ సెంటిమెంట్‌కు హారర్, యాక్షన్ అంశాలు బలంగా మిళితమయ్యాయి” అని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని వీక్షించిన డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్‌పై ప్రశంసలు కురిపించారని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు తెలిపారు. సినిమా విడుదలకు కొంత ఆలస్యమైనప్పటికీ, చూసిన ప్రతి ఒక్కరూ కంటెంట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారని, ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించామని దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ఎర్రచీర’ అనేది ఒక హారర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ చిత్రం. చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తీసుకున్నా. షూటింగ్ 37 రోజుల్లో పూర్తయినప్పటికీ, సీజీ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. గ్రాఫిక్స్ అవుట్‌పుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో మూడు చోట్ల చేయించాల్సి వచ్చింది. ‘హనుమాన్’ సినిమా రేంజ్ క్వాలిటీ కోసం ప్రయత్నించాం. అందుకే లేట్ అయింది. ఈ కథకు తెలుగు అమ్మాయి అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి, కారుణ్య చౌదరిని ఎంపిక చేశా. ఆమె పాత్రలో సస్పెన్స్ ఉంటుంది. ఆమె చాలా బాగా నటించింది. ఈ సినిమాలో శ్రీరామ్, కమల్ కామరాజు, అజయ్, అయ్యప్ప పి. శర్మ, సుమన్ శెట్టి, జీవా, సత్యకృష్ణ, అన్నపూర్ణమ్మ, సురేష్ కొండేటి, రఘుబాబు వంటి దాదాపు 23 మంది ప్రముఖ నటులు ఉన్నారు.
ఇందులో కేవలం 20% మాత్రమే వాస్తవ కథ ఉంటుంది, మిగిలినది కల్పితం. బాబాల గురించి కూడా ఇందులో చూపించా. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. మదర్ సెంటిమెంట్, యాక్షన్ ఉన్న డిఫరెంట్ కంటెంట్. అందుకే పోటీ గురించి భయం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం బి, సి సెంటర్ల థియేటర్లలో ప్రతి షోకి లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం. అక్షయ్ కుమార్ సినిమా ‘భూత్ బంగ్లా’లో పాప పాలు తాగే షాట్‌ను మా సినిమా నుండే కాపీ కొట్టారు. యూత్ కోసం, కమర్షియల్ హంగుల కోసం 36 ముద్దుల కాన్సెప్ట్‌తో ఒక పాటను పెట్టాం. అది కథ డిమాండ్ మేరకే పెట్టాం. ఎర్రచీరకు సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యదార్థ గాధతో ‘అంబిక (ఎర్రచీర-2)’ సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నా. అలాగే ‘రాముడా? కృష్ణుడా?’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తున్నా. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నా.’’ అని తెలిపారు.






