Malavika Mohanan: బ్లాక్ డ్రెస్ లో రాజా సాబ్ బ్యూటీ గ్లామర్ షో
మాళవిక మోహనన్(malavika mohanan) టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది రాజా సాబ్(raja saab) సినిమాతోనే అయినప్పటికీ పలు డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలే. తన అందం, అభినయంతో ఆడియన్స్ ను మెప్పించే మాళవిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా మాళవిక బ్లాక్ కలర్ డిఫరెంట్ అవుట్‌ఫిట్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో మాళవిక చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో పాటూ డిఫరెంట్ జ్యుయలరీని ధరించి అవతారమిచ్చింది. మాళవిక షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.






