చపాతీలు ఎంత మృదువుగా ఉంటే అంత రుచిగా ఉంటాయి. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ రోటీలు తయారు చేయవచ్చు.
పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తే పిండి మెత్తగా తయారవుతుంది. దీంతో రోటీలు కూడా మృదువుగా వస్తాయి.
పిండిలో ఒక టీ స్పూన్ నూనె లేదా నెయ్యి కలిపితే చపాతీలు ఎక్కువసేపు సాఫ్ట్‌గా ఉంటాయి.
పిండిని కలిపిన వెంటనే రోటీలు చేయకుండా కనీసం 20 నుంచి 30 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
రోటీలను ఒత్తేటప్పుడు చాలా పలుచగా లేదా చాలా మందంగా చేయకూడదు. సమానమైన మందంతో ఉంటే బాగా ఉడుకుతాయి.
పెనంపై రోటీ వేసిన తర్వాత సరైన వేడి ఉండేలా చూసుకోవాలి. అధిక మంటపై కాలిస్తే గట్టిగా మారే అవకాశం ఉంటుంది.
రెండు వైపులా సమంగా కాలిన తర్వాత స్వల్పంగా నెయ్యి రాస్తే రోటీలు మరింత రుచిగా ఉంటాయి.
తయారైన రోటీలను వెంటనే గుడ్డలో లేదా మూత ఉన్న డబ్బాలో ఉంచితే వాటి తేమ నిలిచి ఉంటుంది.
ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే ప్రతిసారి మెత్తగా, పొంగిపొర్లే రోటీలను కుటుంబ సభ్యులకు అందించవచ్చు.