జూన్ 21న సాక్రమెంటోలో ‘TAGS’ యోగా వేడుకలు
TAGS: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో’ (TAGS) ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం జూన్ 21, 2026న ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఫోల్సమ్, 4578 స్పారో డ్రైవ్‌లో ఉన్న ప్రాస్పెక్టర్ పార్క్ ఈ వేడుకకు వేదికగా నిలవనుంది.
అవగాహన కార్యక్రమాలు..
ఈ యోగా సెషన్‌ను ‘ఇషా సర్టిఫైడ్ హఠా యోగా టీచర్’ రవికిరణ్ కట్నం నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ‘హార్ట్ఫుల్నెస్’ ద్వారా ధ్యానం , ‘సిరి సోవాక’ ద్వారా చిరుధాన్యాల (Millets) ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేయబడ్డాయి.
వివరాలు..
ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. పాల్గొనేవారు తమతో పాటు యోగా మ్యాట్ , నీళ్ల బాటిళ్లను వెంట తెచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. మరిన్ని వివరాల కోసం TAGS అధికారిక వెబ్సైట్ www.sactelugu.org ను సందర్శించవచ్చు లేదా sactags@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చు.








